Home  »  TV News  »  Illu illalu pillalu : చిక్కుల్లో పడ్డ వల్లి.. నిజం నిరూపించేందుకు నర్మద స్కెచ్!

Updated : Jul 2, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -512 లో.. నర్మద ఒక దగ్గర కూర్చుంటుంది. జరిగిందంతా చేసుకొని నర్మద బాధపడుతుంది. లేని కడుపుని ఉన్నట్లు క్రియేట్ చేసి ఇప్పుడు తప్పు నాది అంటున్నారు.. ఇప్పుడు వల్లి కడుపు నిజం కాదన్న విషయం బయటపెట్టాలంటే ఏం చెయ్యాలని నర్మద ఆలోచిస్తుంది. అప్పుడే తనకి ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చిన డాక్టర్ గుర్తుకువస్తుంది. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ పట్టుకొని వెళ్లి డాక్టర్ ని అడగాలి. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ అన్నీ వల్లి రూమ్ లో ఉన్నాయి.. ఎలా తీసుకొని రావాలని నర్మద అనుకుంటుంది.

నర్మదని చూసి పాపం మనం ఇచ్చిన దెబ్బకి ఎలా అయిపోయిందో చూడమని సుకన్య, వల్లి అనుకుంటారు. తనని ఇంకా ఏడిపించాలని వల్లి అనుకుంటుంది‌. వెంటనే తన దగ్గరికి వల్లి వస్తుంది. పాపం చెల్లి.. అత్తయ్య తిట్టిందని భాదపడుతున్నావా.. నువ్వు అందులో నుంచి బయటకు రావాలంటే ఒక ఆట ఆడుకున్నామా.. ఏం అట అని నర్మద అంటుంది. దొంగ పోలీస్ అని వల్లి అనగానే ఇదేదో మనకి ఉపయోగపడేలా ఉందని నర్మద అనుకుంటుంది. నేను దొంగ.. నువ్వు పట్టుకోవాలని వల్లి అంటుంది. సుకన్య ఒకవైపు వల్లి ఒకవైపు దాక్కుంటారు. నర్మద వెళ్లి వల్లి గదిలో రిపోర్ట్స్ వెతుకుతుంది. రిపోర్ట్స్ దొరుకుతాయి.. అక్క నువ్వు దొరకడం చాలా కష్టం నాకు.. ఆఫీస్ కీ టైమ్ అయిందని నర్మద రిపోర్ట్స్ తీసుకొని వెళ్తుంది. మరొక వైపు సుకన్య దాక్కున్న దగ్గర తిరుపతి ఉంటాడు. ఇక తిరుపతి పెట్టే నస సుకన్యకి చిరాకు వస్తుంది. 

మరొకవైపు ప్రేమ కోసం డ్యాన్స్ ప్రోగ్రాం హెడ్ రాజా పుష్పం వెయిట్ చేస్తాడు. ప్రేమ రాగానే బొకే ఇచ్చి వెల్ కమ్ చెప్తాడు. నీ రాక కోసం వెయిట్ చేస్తున్నానని అతను అనగానే అదేంటీ అని ప్రేమ అంటుంది. అంటే ప్రోగ్రాం కదా అని కవర్ చేస్తాడు. తనకి ఒక రూమ్ ఇస్తారు. లోపలికి వెళ్తుంది. అప్పుడే ప్రేమకి ధీరజ్ ఫోన్ చేసి.. మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఎలా ఉందని అడుగుతాడు. బాగుందని ప్రేమ చెప్తుంది. ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్యమని ధీరజ్ చెప్తాడు. దానికి ప్రేమ సారీ చెప్తుంది. ఎందుకే నాకూ ఏదో అబద్ధం చెప్పి వెళ్లినట్లు ఉందని ధీరజ్ అనుకుంటాడు. మరొకవైపు డాక్టర్ దగ్గరికి నర్మద వెళ్తుంది. ఆ రిపోర్ట్స్ మీరు వల్లికి ఇచ్చారు.. అసలు ఎందుకు ఇచ్చారని నర్మద అనగానే డాక్టర్ టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.